కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా సందీప్ కిషన్ అలాగే కాళిదాసు జైరాం ఇంకా సెల్వ రాఘవన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా “రాయన్” కోసం తెలిసిందే. ధనుష్ ఈ చిత్రానికి హీరోగా మాత్రమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు. పైగా ఇది తన కెరీర్ 50వ సినిమా కావడం విశేషం. మరి ఇలా థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యి ఈ ఏడాదిలో కోలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా కూడా నిలిచింది.
అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కి వచ్చేసింది. ఈ సినిమా హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇందులోఈ సినిమా నేటి నుంచి ఒరిజినల్ తమిళ్ సహా మన తెలుగు భాషలో ఇంకా ఇతర పాన్ ఇండియా భాషల్లో ఎంట్రీ ఇచ్చేసింది. మరి ఈ చిత్రాన్ని చూడాలి అనుకునేవారు నేటి నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.