తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం రాయన్ ఇప్పటికే కోలీవుడ్ లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను ధనుష్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు ముగించుకుంది.
రాయన్ సినిమాకు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ జారీ చేసినట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో వయొలెన్స్ ఎక్కువగా ఉందనే కారణంగా రాయన్ మూవీకి A సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేశారు. 2 గంటల 25 నిమిషాల నిడివితో ఈ సినిమా వస్తున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, ప్రకాశ్ రాజ్, సెల్వ రాఘవన్, సందీప్ కిషన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా, జూలై 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.