రీరిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “రఘువరన్ బీటెక్”

రీరిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “రఘువరన్ బీటెక్”

Published on Dec 4, 2024 12:10 PM IST


కోలీవుడ్ వెర్సటైల్ హీరోస్ లో టాలెంటెడ్ నటుడు ధనుష్ కూడా ఒకరు. మరి ధనుష్ నటించిన చిత్రాల్లో అటు తమిళ్ తో పాటుగా తెలుగు ఆడియెన్స్ యువని కూడా ఎంతగానో ఆకట్టుకున్న చిత్రాల్లో కల్ట్ సెన్సేషనల్ హిట్ చిత్రం “రఘువరన్ బీటెక్” కూడా ఒకటి. మరి ఇది వచ్చిన అప్పట్లో యువతని ఒక రేంజ్ లో ఊపు ఊపేసింది. మరి ఎట్టకేలకి మరోసారి తెలుగు ఆడియెన్స్ ని పలకరించేందుకు సిద్ధం అయ్యింది.

తెలుగులో ఈ చిత్రాన్ని ఈ జనవరి 4న 2025 లో మళ్ళీ విడుదల చేస్తున్నట్టుగా శ్రీస్రవంతి మూవీస్ వారు అనౌన్స్ చేసేసారు. ఇది మాత్రం మన తెలుగు యువతకి సాలిడ్ న్యూస్ అని చెప్పాలి. అప్పట్లో ఈ సినిమాని చాలా మంది థియేటర్స్ లో మిస్ అయ్యారు. మరి ఈ సరి డెఫినెట్ గా బాగానే సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో అమలా పాల్ హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు