ఓటిటిలో వచ్చేసిన ధనుష్ ఎమోషనల్ హిట్ “తిరు”.!

Published on Sep 23, 2022 8:59 am IST

కోలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి ధనుష్ హీరోగా ఇప్పుడు వరుసగా నాన్ స్టాప్ సినిమాలు చేసి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆల్రెడీ రెండు సినిమాలతో ఆడియెన్స్ ని పలకరించిన తాను వాటిలో ఎమోషనల్ హిట్ “తిరు” చిత్రం కూడా ఒకటి. అయితే ఈ సినిమాకి మన తెలుగులో కూడా మంచి ఆదరణ లభించింది. అయితే మన తెలుగులో చాలా మంది ఈ సినిమా రిలీజ్ అయ్యాక టాక్ విని థియేటర్స్ లో మిస్ అయ్యిన వారు కూడా ఉన్నారు.

మరి వారికి గిఫ్ట్ గా అయితే ఈ చిత్రం ఈరోజు నుంచి ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ప్రముఖ ఓటిటి సంస్థ సన్ నెక్స్ట్ లో అయితే ఈ చిత్రం తెలుగు మరియు తమిళ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి ఇప్పుడు అయితే అయితే వారు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక ఈ చిత్రంలో నిత్యా మీనన్ అలాగే రాశీ ఖన్నా లు హీరోయిన్స్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే మిత్రన్ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :