‘రాయ‌న్’ ఓటిటి పార్ట్న‌ర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇందులోనే!

‘రాయ‌న్’ ఓటిటి పార్ట్న‌ర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇందులోనే!

Published on Jul 26, 2024 9:30 PM IST

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ కెరీర్ లో ప్రెస్టీజియ‌స్ మూవీగా వచ్చిన ‘రాయ‌న్’ నేడు థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను ధ‌నుష్ స్వయంగా డైరెక్ట్ చేసి న‌టించాడు. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్ష‌కులు ఆస‌క్తిని చూపుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓటిటి పార్ట్న‌ర్ ను మేక‌ర్స్ లాక్ చేశారు.

‘రాయ‌న్’ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ స‌న్ నెక్ట్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా టాక్ ను బ‌ట్టి ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేయ‌నున్నారు. ఇక ఈ సినిమాలో ధ‌నుష్ ప‌ర్ఫార్మెన్స్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తుండ‌టంతో చిత్ర యూనిట్ సంతోషం వ్య‌క్తం చేస్తోంది.

సందీప్ కిష‌న్, దుష‌ర విజ‌య‌న్, కాళిదాసు జైరామ్, అప‌ర్ణా బాల‌ముర‌ళి, ఎస్.జె.సూర్య త‌దిత‌రుల ముఖ్య పాత్ర‌ల్లో నటించిన ‘రాయన్’ చిత్రానికి ఏఆర్.రెహ‌మాన్ సంగీతం అందించారు. ఈ సినిమాను స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ ప్రొడ్యూస్ చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు