రీ-రిలీజ్ అయిన ధనుష్ మూవీకి సూపర్ రెస్పాన్స్!

రీ-రిలీజ్ అయిన ధనుష్ మూవీకి సూపర్ రెస్పాన్స్!

Published on Sep 15, 2024 10:08 PM IST

కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ చివరిసారిగా రాయన్ చిత్రంలో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు సాధించి, సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ హీరో నటించిన 3 మూవీ 2012 లో థియేటర్లలో రిలీజ్ అయ్యి తెలుగులో ఫ్లాప్ గా నిలిచింది. కానీ, యూత్ ను మాత్రం బాగానే అలరించింది. ఈ చిత్రం తాజాగా రీ-రిలీజ్ అయ్యింది.

ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో శృతి హాసన్ హీరోయిన్ నటించిన ఈ చిత్రం రీ-రిలీజ్ కి మొదటి రోజు దేశ వ్యాప్తంగా 1.55 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. వీకెండ్ కావడంతో సినిమా ఈరోజు కూడా మంచి వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. సూర్య S/o కృష్ణన్ రీ – రిలీజ్‌ మంచి విజయం సాధించింది. 3 చిత్రం కూడా అదే రేంజ్ లో సక్సెస్ కావడంతో మరిన్ని చిత్రాలు రీ-రిలీజ్ కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు