టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ధూం ధాం’ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో డీసెంట్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాను దర్శకుడు మచ్చా సాయి కిషోర్ డైరెక్ట్ చేయగా చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ లీడ్ రోల్‌లో నటించారు. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మంచి సక్సెస్ అందుకున్నాయి.
ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చింది. నేటి(జనవరి 31’ నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. ఈ సినిమాలోని లవ్, కామెడీ, ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాను ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూసే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఈ సినిమాలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, వినయ్ వర్మ, బెనర్జీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాను ఎం.ఎస్.రామ్ కుమార్ ప్రొడ్యూస్ చేశారు.