గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలను క్రియేట్ చేశాయి.
ఈ సినిమా నుండి నెక్స్ట్ సింగిల్ సాంగ్‌గా ధోప్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. డిసెంబర్ 21న ఈ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే, ఈ సాంగ్‌ను అమెరికాలోని డల్లాస్‌లో ఓ ఈవెంట్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ పాటను అక్కడ డిసెంబర్ 21న రాత్రి 9 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో ఈ పాట ఇండియాలో డిసెంబర్ 22న ఉదయం 8.30 గంటలకు అందుబాటులోకి రానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇక ఈ పాటలో రామ్ చరణ్ చేసిన డ్యాన్స్.. ఆయన వేసిన మూమెంట్స్ ప్రేక్షకులకు ఓ ట్రీట్‌గా ఉండబోతున్నాయని వారు తెలిపారు. తాజాగా ఓ స్టైలిష్ స్టెప్ వేస్తున్న రామ్ చరణ్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు. దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.