మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి బాక్సాఫీస్ దగ్గర మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ కాగా, వాటికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఈ సినిమాలోని ‘ధోప్’ అనే పాటను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
ఈ ‘ధోప్’ పాటపై ఇప్పటికే చిత్ర యూనిట్ అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. అయితే, ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోతోనే సాంగ్‌పై నెలకొన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు ఒక ఎత్తైతే, ఈ ‘ధోప్’ సాంగ్ మరో ఎత్తు అన్నట్లుగా ఈ ప్రోమో కట్ ఉంది. అదిరిపోయే ట్రెండీ మ్యూజిక్‌తో ఈ పాటను కంపోజ్ చేశారు. ఇక ఈ పాట రిలీజ్ అయితే, ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలవడం ఖాయమని చెప్పాలి. ‘ధోప్’ సాంగ్‌ను డిసెంబర్ 21న అమెరికాలోని డల్లాస్‌లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
మొత్తానికి ‘గేమ్ ఛేంజర్’ సినిమాకే హైలైట్‌గా నిలవనున్న ‘ధోప్’ సాంగ్ థియేటర్లలో అభిమానులతో స్టెప్పులు వేయించడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోండగా.. అంజలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి