‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘ధోప్’ సాంగ్‌కు డేట్ ఫిక్స్

‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘ధోప్’ సాంగ్‌కు డేట్ ఫిక్స్

Published on Dec 18, 2024 3:05 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ నుంచి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ధోప్’ సాంగ్‌పై చిత్ర యూనిట్ వరుస అప్డేట్స్ ఇస్తూ అంచనాలను పెంచేస్తోంది. ఇక ఈ సాంగ్ ఈ చిత్రానికే హైలైట్‌గా ఉండటం ఖాయమని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. దీంతో ఈ పాట ఎప్పుడెప్పుడు వస్తుందా.. ఇది ఎలా ఉంటుందా అని అభిమానుల్లో ఆతృత మొదలైంది.

అయితే, ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ది మోస్ట్ అవైటెడ్ ‘ధోప్’ సాంగ్‌ను డిసెంబర్ 21న రిలీజ్ చేస్తున్నట్లు వారు ఓ సరికొత్త పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్, అందాల భామ కియారా అద్వానీల స్టన్నింగ్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ పాటకు సంబంధించిన ప్రోమోను నేడు సాయంత్రం 6.03 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు వారు తెలిపారు.

దీంతో ‘ధోప్’ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ పాటను థమన్ తన మ్యూజిక్‌తో నెక్స్ట్ లెవెల్‌లో కంపోజ్ చేశాడని ఇప్పటికే చర్చ సాగుతోంది. మరి ఈ పాట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాను దర్శకుడు శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా డైరెక్ట్ చేస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు