రామ్ చరణ్ తాజా చిత్రం ధృవ విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర యూనిట్ ప్రమోషన్ జోరుని మెల్లగా పెంచుతోంది.ప్రమోషన్ పై ద్రుష్టి సారించిన చిత్ర బృందం చిత్రానికి సంబందించిన రామ్ చరణ్ ఫోటోలను వదులుతోంది.
ఇప్పటికే ధృవ టీజర్ తెలుగురాష్ట్రాలలో అన్ని థియోటర్ లలో ప్రదర్శింపబడుతోంది.ఈ చిత్రం లో రామ్ చరణ్ పోలీస్ పాత్రలో నటిస్తుండడం, చరణ్ లుక్స్ కూడా బావుండడంతో చిత్రం పై ఆసక్తి పెరుగుతోంది.ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా అరవింద స్వామీ, రకుల్ ప్రీత్ సింగ్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.