విక్రమ్ “ధృవ నట్చతిరం” యూఎస్ ప్రీమియర్స్ కి డేట్ ఫిక్స్!

విక్రమ్ “ధృవ నట్చతిరం” యూఎస్ ప్రీమియర్స్ కి డేట్ ఫిక్స్!

Published on Nov 1, 2023 8:00 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ధృవ నట్చతిరం. నవంబర్ 24, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని యూఎస్ లో సరిగమ సినిమాస్ మరియు థింక్ బిగ్ పిక్చర్స్ వారు నవంబర్ 23 న రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు.

రీతు వర్మ, ఆర్. పార్థిబన్, రాధికా శరత్ కుమార్, సిమ్రాన్, వినాయకన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు