పవన్, రానా.. మాటలే తూటాలట !

Published on Mar 9, 2021 12:30 am IST


పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు ఇది తెలుగు రీమేక్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం:12గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభమైంది. పవన్, రానా కాంబినేషన్ ప్రేక్షకులు అస్సలు ఊహించనిది కావడంతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొని ఉంది.

ప్రతినాయకుడిగా రానా ఇప్పటికే ఒక బెంచ్ మార్క్ సెటప్ చేసుకున్నారు. ఆ మార్క్ ఈ సినిమాతో ఇంకాస్త ముందుకు వెళుతుందని అంటున్నారు. సినిమాలో పవన్, రానాల నడుమ నడిచే సంభాషణలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయట. తూటాల్లా పేలే ఆ మాటల్లో మంచి మెసేజ్ కూడ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరి పాత్రలు సమానంగా ఉంటాయని అంటున్నారు. అలాంటిది డైలాగ్స్ కూడ నువ్వా నేనా అన్నట్టే ఉండటం ఇంట్రెస్టింగ్ అంశం.స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :