ఆ డైరెక్టర్‌కు స్టార్ ప్రొడ్యూస్ ఓకే చెప్పాడా..?

టాలీవుడ్‌లో సక్సెస్ సాధించిన చాలా మంది దర్శకులు వరుస ఫ్లాపుల కారణంగా ఫేడవుట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే, వారిలో కొందరు మాత్రమే మళ్లీ సాలిడ్ కమ్‌బ్యాక్‌తో తిరిగి సక్సెస్ సాధించి తమ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లారు. కానీ, కొందరు తమకు సరైన కమ్‌బ్యాక్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో దర్శకుడు కరుణాకరణ్ కూడా ఒకరు. తొలిప్రేమ, వాసు, ఉల్లాసంగా ఉత్సాహంగా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన కరుణాకరణ్ ప్రస్తుతం ఓ సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఆయన నుంచి వచ్చిన లాస్ట్ హిట్ మూవీ ‘డార్లింగ్’. ఆ తరువాత ఆయన కొన్ని ఫ్లాప్స్ వరుసగా ఇచ్చారు. ఇక కరుణాకరణ్ డైరెక్ట్ చేసిన లాస్ట్ మూవీ ‘తేజ్ ఐ లవ్ యు’ కూడా బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలయ్యింది. దీంతో ఇప్పుడు ఆయన ఓ మంచి కథను రెడీ చేస్తున్నాడని, దీనిని ఓ స్టార్ ప్రొడ్యూసర్‌కి వినిపించగా ఆయన ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమైనట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరో కాదు.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కరుణాకరణ్ చెప్పిన కథ దిల్ రాజుకి నచ్చడంతో, ఇప్పుడు ఆయన ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నారట. ఇక ఈ సినిమాలో ఆశిష్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version