మహేష్ ని జక్కన్న మూడేళ్ల పాటు లాక్ చేయనున్నారా .. ?

Published on Jul 6, 2022 3:00 am IST

ప్రస్తుతం ఇండియాలోని మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, జక్కన్న కాంబో మూవీ కూడా ఒకటి. కేఎల్ నారాయణ నిర్మాతగా శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ ఫై ఎంతో భారీ వ్యయంతో హై టెక్నీకల్ వాల్యూస్ తో ఈ మూవీ రూపొందనుంది. పాన్ ఇండియాని మించేలా పాన్ వరల్డ్ స్థాయిలో ఈ మూవీని తెరకెక్కించేందుకు జక్కన్న పక్కాగా ప్లాన్స్ రెడీ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ మూవీ కోసం విజయేంద్రప్రసాద్ పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కీరవాణి మ్యూజిక్ అందించనున్న ఈ మూవీ వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో మొదలు కానుండగా మొత్తంగా మహేష్ బాబు దీని కోసం మూడేళ్ళ పాటు పనిచేయనున్నారట. అయితే మధ్యలో షూటింగ్ గ్యాప్ లు తీసివేస్తే ఏడాదిన్నరకి పైగా చిత్రీకరణ కొనసాగనుందట . అలానే ఈ ఓవైపు ఈ భారీ మూవీ కోసం పలు హాలీవుడ్ భారీ టెక్నీకల్ సంస్థలతో కలిసి పనిచేయనున్నారట జక్కన్న . మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమా రిలీజ్ తరువాత సూపర్ స్టార్ మహేష్ సిల్వర్ స్క్రీన్ పై దర్శనమిచ్చేది మూడేళ్ళ తరువాతేనట. అయితే పక్కాగా ఈ మూవీకి సంబంధించి పూర్తి విషయాలు వెల్లడికావడానికి మరికొన్ని నెలల టైం పట్టనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :