మెగా ఆఫర్‌ను శ్రీలీల రిజెక్ట్ చేసిందా..?

మెగా ఆఫర్‌ను శ్రీలీల రిజెక్ట్ చేసిందా..?

Published on Aug 18, 2024 3:00 AM IST

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా హీరోలందరికీ శ్రీలీల హాట్ ఫేవరెట్ అయ్యింది. దీంతో ఆమె ఏ హీరోతో ఎలాంటి సినిమా చేస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. అయితే ఈ యంగ్ బ్యూటీ ఓ మెగా ఆఫర్ మిస్ చేసుకున్నట్లుగా సినీ సర్కిల్స్‌లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండగా.. అందులో డ్యాన్స్ చేసేందుకు శ్రీలీలను అడిగారట మేకర్స్. అయితే, హీరోయిన్‌గా ఎదుగుతున్న తాను ఇప్పుడే స్పెషల్ సాంగ్స్ చేస్తే తన కెరీర్‌కి కలసిరాదని ఈ బ్యూటీ ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందనే టాక్ వినిపిస్తోంది.

ఏదేమైనా మెగాస్టార్ పక్కన డ్యాన్స్ చేసే ఛాన్స్‌ను వదులుకోవడం శ్రీలీలకు ఎంతమేర కలిసొస్తుందో అని అభిమానులు అనుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఆమె దీనిపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు