ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో రామ్ పోతినేని కూడా ఒకడు. ఒక చాకోలెట్ బాయ్ గా సినిమాల్లో కనిపిస్తాడు కానీ తనలో ఒక డైనమిక్ ఎనర్జీనే దాచుకున్నాడు. అలా ఇపుడు “డబుల్ ఇస్మార్ట్” చిత్రంతో పాన్ ఇండియా రిలీజ్ కి రాబోతున్నాడు. అయితే రామ్ కోసం చాలా మందికి తెలియని పలు ఇంట్రెస్టింగ్ విషయాలు దాగి ఉన్నాయి.
ఇది మీకు తెలుసా రామ్ తన 11వ ఏట లోనే ఏకంగా 18 ఏళ్ల కుర్రాడిలా నటించాడు అని? అవును ఇది నిజమే రామ్ యంగ్ ఏజ్ లోనే నటుడిగా మంచి ఆదరణ అందుకున్నాడు. అలా తన 11 ఏళ్ల ఏజ్ లోనే ఒక 18 ఏళ్ల యువకుడి పాత్రలో తమిళ్ లో షార్ట్ ఫిలిం చేస్తే దానికి అవార్డు కూడా వచ్చింది. మరి ఆ షార్ట్ ఫిలిం పేరే ‘అడయాలం’. తమిళ్ లో ఈ షార్ట్ ఫిలిం ని తెరకెక్కించగా 11 ఏళ్ల రామ్ పోతినేని 18 ఏళ్ల డ్రగ్ అడిక్ట్ యువకుడిగా నటించాడు.
సుమారు 42 నిమిషాల నిడివితో ఈ షార్ట్ ఫిలింని రామ్ అండ్ ఫ్రెండ్స్ 2000 – 2001 లో చేశారట. ఈ విషయాన్ని రామ్ కూడా రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అప్పటికి యూట్యూబ్ లాంటివి లేవు కానీ అప్పట్లోనే తన నటనకి గాను యూరప్ ఫిలిం ఫెస్టివల్ లో అవార్డు కూడా తాను అందుకున్నాడు. ఇలా రామ్ సినిమాల్లోకి రాకముందే తన సత్తా చాటి అదరగొట్టాడు.