శివ ఆలపాటి “డై హార్డ్ ఫ్యాన్” ఫస్ట్ లుక్ కు భారీ రెస్పాన్స్!

శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిరామ్ M దర్శకత్వంలో శివ ఆలపాటి మరియు ప్రియాంక శర్మ కీలక పాత్రలలో నటిస్తున్న చిత్రం డై హార్డ్ ఫ్యాన్. ఒక సెలెబ్రిటీకి, అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామా ఈ సినిమా కథ. డై హార్డ్ ఫ్యాన్ పాత్రలో శివ ఆలపాటి నటించారు. ఈ ఇద్దరి మధ్య సాగే డ్రామా ఇది. తాజాగా శివ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇంటెన్స్ లుక్ తో ఉన్న ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో షకలక శంకర్ బేబమ్మగా, రాజీవ్ కనకాల కృష్ణ కాంత్ గా కీలక పాత్రల్లో నటించారు.

ఇటీవల విడుదలైన ఈ ఇద్దరి ఫస్ట్ లుక్ కి కూడా విశేష స్పందన రావడంతో చిత్ర బృందం వారి సంతోషాన్ని తెలియజేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సినిమా పూర్తిగా కామెడీ సస్పెన్స్ డ్రామాగా రాబోతుంది. ఈ సినిమాకు మధు పొన్నాస్ చక్కటి సంగీతం అందించారు. ఈ సినిమాకు సయ్యద్ తాజుద్దీన్ మాటలు అందించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

శివ ఆలపాటి, ప్రియాంక శర్మ, షకలక శంకర్, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు అభిరామ్ M, నిర్మాత చంద్రప్రియ సుబుద్ధి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్ కింతలి, పిఆర్ఓ ఏలూరు శ్రీను, మేఘశ్యామ్, మాటలు సయ్యద్ తాజుద్దీన్, సంగీతం మధు పొన్నాస్, సినిమాటోగ్రఫీ జగదీష్ బొమ్మిశెట్టి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వెంకటేష్ తిరుమల శెట్టి లుగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version