గేమ్ చేంజర్: క్రిస్మస్ కి కలుద్దాం – దిల్ రాజు

గేమ్ చేంజర్: క్రిస్మస్ కి కలుద్దాం – దిల్ రాజు

Published on Jul 21, 2024 10:01 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ డ్రామా గేమ్ చేంజర్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం రిలీజ్ పై ఎప్పటి నుండో ఉన్న సస్పెన్స్ కి తెర పడింది. ఈరోజు జరిగిన రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు.

రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. ఈ క్రిస్మస్ కి కలుద్దాం అంటూ చెప్పుకొచ్చారు. డిసెంబర్ నెలలో సినిమా రిలీజ్ కానుంది అన్నట్లుగా ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పుడు కన్ఫర్మ్ చేయడం తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు 2 రిలీజ్ కావడంతో ఇక మొత్తం ఫోకస్ గేమ్ చేంజర్ పైనే ఉంది. ఈ చిత్రంలో అంజలి, ఎస్.జే. సూర్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు