మన రాష్ట్రంలో జరిగే ఘటనలు గుర్తుకు వస్తాయి – దిల్ రాజు

మన రాష్ట్రంలో జరిగే ఘటనలు గుర్తుకు వస్తాయి – దిల్ రాజు

Published on Jan 4, 2025 11:08 PM IST

గేమ్ ఛేంజర్ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌ను రాజమండ్రిలో నిర్వహించగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఇక ఈ ఈవెంట్‌ను వీక్షించేందుకు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాత దిల్ రాజు ‘గేమ్ ఛేంజర్’ మూవీకి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

‘గేమ్ ఛేంజర్’ మూవీ వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కించామని.. దర్శకుడు శంకర్ ఈ కథను రాసుకున్న విధానం చూస్తే మన కళ్ల ముందు జరిగిన సన్నివేశాలు గుర్తుకు వస్తాయని.. రామ్ చరణ్ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తారని.. రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉండబోతోందని.. థమన్ మంచి సంగీతాన్ని ఇచ్చారని.. సంక్రాంతికి రాబోతోన్న చిత్రాలకు టికెట్ రేట్ల పెంపు కోసం జీవో ఇచ్చిన ప్రభుత్వానికి థాంక్స్ అంటూ దిల్ రాజు కామెంట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు