గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ‘గేమ్ ఛేంజర్’ టైటిల్ పెట్టడంపై దిల్ రాజు తాజాగా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
టాలీవుడ్‌లో ప్రస్తుతం ‘వేట్టయన్’ మూవీ టైటిల్‌పై చర్చ సాగుతుండటంతో, తాజాగా దిల్ రాజు దీనిపై స్పందించాడు. పాన్ ఇండియా సినిమాలకు ఒకే టైటిల్ పెట్టాలని.. అది దొరకాలని మేకర్స్ ప్రయత్నిస్తారు. కానీ, అలా దొరకడం చాలా కష్టం. ఒక్క భాషలో కూడా టైటిల్ లేకపోతే మిగతా భాషల్లోనూ టైటిల్‌ని మార్చాల్సిన పరిస్థితి. ‘గేమ్ ఛేంజర్’కు తొలుత దర్శకుడు శంకర్ తనకు టైటిల్ చెప్పినప్పుడు దాని కోసం అన్ని భాషల్లో ప్రయత్నించానని.. అయితే, ఒక భాషలో అది దొరకకపోవడంతో, ఆ టైటిల్‌ను రిజిస్టర్‌ను చేయించుకున్న వారితో మాట్లాడి.. అన్ని సెట్ చేసి ‘గేమ్ ఛేంజర్’ టైటిల్‌ని అనౌన్స్ చేశానని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
ఇలా ఒక సినిమా టైటిల్ కోసం మేకర్స్ పడే కష్టాలు చాలా ఉంటాయని.. ప్రేక్షకులు దీన్ని గమనించి టైటిల్‌ని పట్టించుకోకుండా సినిమాలోని కంటెంట్‌ని పట్టించుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.