ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన భారీ హిట్ చిత్రాల్లో వెంకీ మామ హీరోగా నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి లేటెస్ట్ గా ఓ క్రేజీ కాంబినేషన్ తో వచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఇటీవల మళయాళ సినిమా దగ్గర భారీ హిట్ అయిన ఏ రేటింగ్ చిత్రం మార్కో కోసం అందరికీ తెలిసిందే.
మరి ఈ చిత్రం దర్శకుడు హనీఫ్ అదేనితో సాలిడ్ ప్రాజెక్ట్ ని నిర్మాతలు దిల్ రాజు, హర్షిత్ రెడ్డి, దిల్ రాజు కూతురు హన్షితలు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రం భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఉంటుంది అని తెలుస్తుంది. అలాగే తెలుగులోనే ఈ సినిమా తెరకెక్కి పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని క్రేజీ మల్టీస్టారర్ గా కూడా తెరకెక్కిస్తున్నట్టుగా టాక్. మరి ఈ సినిమాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ముందు ముందు రానున్నాయి.