స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ విరాళం

Published on Apr 10, 2020 4:43 pm IST

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ . 10 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. ఆ చెక్కుని స్వయంగా తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి ఆర్ కి ఆయన నివాసంలో కలిసి ఇచ్చారు. దిల్ రాజు, శిరీష్ కలిసి ఈ చెక్ కే టి ఆర్ కి అందజేయడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో ప్రభుత్వానికి మద్దతుగా ఆయన ఈ ఆర్ధిక సహాయం ప్రకటించడం జరిగింది. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు భారీగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సాయం ప్రకటించడం జరిగింది.

దిల్ రాజు ప్రస్తుతం పవన్ హీరోగా వకీల్ సాబ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ మేలో విడుదల కావాల్సివుంది. అలాగే నాని, సుధీర్ హీరోలుగా దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ ‘వి’ విడుదలకు సిద్ధంగా ఉంది. గత ఉగాదికి విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక బన్నీతో ఐకాన్ అనే చిత్రాన్ని కూడా దిల్ రాజు నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More