ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమాలో నటిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ చిత్రం పూర్తవగానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న వంశీ పైడిపల్లి చిత్ర పనుల్ని ఇంకాస్త వేగవంతం చేశారు. చిత్ర సంగీతానికి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారు.
అది కూడా యూఎస్ లో కావడం విశేషం. ఈ సిట్టింగ్స్ లో నిర్మాత దిల్ రాజు కూడా పాలుపంచుకుంటున్నారు. మరి మహేష్ కు ‘నేనొక్కడినే, శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి ఎలాంటి మ్యూజిక్ అందిస్తారో చూడాలి. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రం మొదలుకానుంది. ఇకపోతే ప్రస్తుతం మహేష్, కొరటాల సినిమా షూటింగ్ ప్రత్యేకంగా వేసిన సిఎం ఛాంబర్ సెట్లో జరుగుతోంది.