గేమ్ ఛేంజర్ : ఎస్.జే. సూర్య పై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

గేమ్ ఛేంజర్ : ఎస్.జే. సూర్య పై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Sep 6, 2024 1:02 AM IST

నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సరిపోదా శనివారం చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. త్వరలో ఈ చిత్రం వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం ఘన విజయం సాధించడం పట్ల చిత్ర యూనిట్ విజయ వేడుక ను నిర్వహించింది.

ఈ వేడుకలో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరిపోదా శనివారం చిత్రంలో ఎస్ జే సూర్య విలన్ క్యారెక్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోల్ కు ఆడియెన్స్ నుండి, ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ, గేమ్ ఛేంజర్ కి ఎస్. జే. సూర్య కి కూడా పేపర్లు పడతాయి అంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు