ఆశిష్ మ్యారేజ్ కి సూపర్ స్టార్ మహేష్ ను ఆహ్వానించిన దిల్ రాజు!

ఆశిష్ మ్యారేజ్ కి సూపర్ స్టార్ మహేష్ ను ఆహ్వానించిన దిల్ రాజు!

Published on Feb 9, 2024 4:57 PM IST

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత దిల్ రాజు. 50 చిత్రాలకి పైగా నిర్మించి, సూపర్ సక్సెస్ తో దూసుకు పోతున్నారు. దిల్ రాజు, ఆశిష్ పెళ్లిని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను దిల్ రాజు, శిరీష్ లు ఆహ్వానించారు. నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటికి వెళ్లి పెళ్లి కార్డు ఇచ్చి ఆహ్వానించారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. గుబురు గడ్డం తో, క్యాప్ పెట్టుకొని సూపర్ కూల్ గా కనిపిస్తున్నారు. నమ్రత, మహేష్, దిల్ రాజు, శిరీష్, ఆశిష్ లను ఈ ఫొటోలో చూడవచ్చు. ఆశిష్ రెడ్డి కి, అద్వైత రెడ్డి కి ఇటీవల నిశ్చితార్థం జరిగింది. వీరి పెళ్లి వేడుక కి చాలా మంది ప్రముఖులు హాజరు కానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు