కెరీర్ మొదట్లో కొత్తవాళ్ళతో ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు చేసి కాస్త బ్రేక్ ఇచ్చిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం లో బడ్జెట్ లో ‘కేరింత’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ‘వినాయకుడు’ ఫేం సాయి కిరణ్ అడవి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మిగతా నటీనటులందరినీ స్టార్ హంట్ ద్వారా సెలెక్ట్ చేసినా హీరోయిన్ కోసం కొద్ది రోజులు అన్వేషించారు.
తాజాగా సుమంత అశ్విన్ సరసన హీరోయిన్ గా ‘అందాల రాక్షసి’ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న లావణ్య త్రిపాటిని సెలక్ట్ చేసుకున్నారు. ప్రస్తుతం లావణ్య ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మిక్కీ జె మేయర్ సంగీతం, అబ్బూరు రవి మాటలు అందిస్తున్న ఈ సినిమా ద్వారా ఎడిటర్ గా మధు, సినిమాటోగ్రాఫర్ గా విశ్వ, కొరియోగ్రాఫర్ గా విజయ్ లని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు.