రామ్ చరణ్ బిగ్గెస్ట్ కటౌట్ లాంచ్‌కు గెస్టుగా దిల్ రాజు

రామ్ చరణ్ బిగ్గెస్ట్ కటౌట్ లాంచ్‌కు గెస్టుగా దిల్ రాజు

Published on Dec 27, 2024 9:59 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతుండటంతో ఫ్యాన్స్ కూడా తమ హీరో సినిమాపై తమ అభిమానాన్ని చాటేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఇండియాలోనే బిగ్గెస్ట్ కటౌట్‌ను లాంచ్ చేసేందుకు వారు రెడీ అయ్యారు. ఈ రామ్ చరణ్ భారీ కటౌట్‌ను డిసెంబర్ 29న విజయవాడలో లాంచ్ చేసేందుకు అభిమానులు ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ బిగ్గెస్ట్ కటౌట్ లాంచ్‌కు చీఫ్ గెస్టుగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు హాజరుకానున్నారు.

దీంతో మెగా ఫ్యాన్స్‌లో ఈ బిగ్గెస్ట్ కటౌట్ లాంచ్ ఈవెంట్‌పై ఆసక్తి పెరిగింది. ఈ కటౌట్ లాంచ్‌తో తమ అభిమానాన్ని చాటేందుకు వారు రెడీ అవుతున్నారు. ఇక ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని డిసెంబర్ 10న గ్రాండ్ రిలీజ్ చేయనుండగా ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు