‘దిల్ రాజు’ వివాహం నేడే !

‘దిల్ రాజు’ వివాహం నేడే !

Published on May 10, 2020 10:44 AM IST

టాలీవుడ్‌ లో నిర్మాతగా తిరుగు లేని విజయాలను అందుకున్న ప్రముఖ నిర్మాత ‘దిల్ రాజు’ ఈ రోజు రాత్రి వివాహం చేసుకోబోతున్నారు. తన స్వస్థలమైన నిజామాబాద్‌ లోని వెంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో దిల్ రాజు వివాహం జరగనుంది. ప్రభుత్వ సూచనల మేరకు ఈ వివాహానికి కేవలం 10 మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవ్వనున్నారు.

కాగా మూడేళ్ళ క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్యం కారణంగా మరణించడంతో ఆయన ఒంటరిగా జీవిస్తున్నారు. దీంతో మరో పెళ్లి చేసుకోమని కుటుంబ సంభ్యులు, సన్నిహితులు ఎప్పటినుండో కోరుతూ ఉండటంతో దిల్ రాజు రెండో వివాహానికి అంగీకరించారు. తన పెళ్లి పై దిల్ రాజు స్పందిస్తూ స్వయంగా సోషల్ మీడియాలో ఓ సందేశం పోస్ట్ చేశారు.

‘ప్రస్తుతం ఈ ప్రపంచం ఎదురుకుంటున్న పరిస్థితులను ఎవ్వరూ జీర్ణించుకోలేపోతున్నాము. ఇలాంటి కష్ట సమయంలో వృత్తిపరంగా ఎదురయ్యే ఇబ్బందుల నుండి త్వరగా కోలుకోలేము. ఇక వ్యక్తిగతంగానూ నాకు గత కొన్ని రోజుల నుంచి మంచి టైమ్ రాలేదు. అంతా త్వరలోనే సర్దుకుంటుందని, అందరికీ మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను. అదే ఆశతో నా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. అందుకు ఇదే అదునైన సమయంగా భావిస్తున్నాను” అని దిల్ రాజు పోస్ట్ చేసారు.

దిల్ రాజుకు సంతోషకరమైన వైవాహిక జీవితం కలగాలని కోరుకుంటూ 123telugu.com తరుపున దిల్ రాజుకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు