‘గేమ్ ఛేంజర్’ కోసం పవన్ తో దిల్‌ రాజు !

‘గేమ్ ఛేంజర్’ కోసం పవన్ తో దిల్‌ రాజు !

Published on Dec 30, 2024 12:58 PM IST

‘గేమ్ ఛేంజర్’ కోసం ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తో నిర్మాత దిల్‌ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్‌ను దిల్ రాజు కలిసి.. రామ్‌ చరణ్‌ కొత్త సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏపీలో నిర్వహించాలని తాము భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే, ఈ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని పవన్‌ కళ్యాణ్ ను దిల్ రాజు కోరారు. పవన్ కూడా ఈ ఈవెంట్ కి రావడానికి అంగీకరించారని తెలుస్తోంది. అనంతరం సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి దిల్ రాజు – పవన్ మధ్య చర్చ జరిగింది. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 10న ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రేక్షకుల ముందుకురానుంది.

చరణ్ – స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ లో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. ఈ పొలిటికల్ డ్రామా పై మెగా ఫ్యాన్స్ కి ఇప్పటికే విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకి తమన్‌ స్వరాలు సమకూర్చారు. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌, ప్రకాశ్‌రాజ్‌, జయరామ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘గేమ్‌ ఛేంజర్‌’ విడుదల కానుంది. ఇక జనవరి 4 లేదా 5 తేదీల్లో ఏపీలో సినిమాకు సంబంధించిన భారీ కార్యక్రమాన్ని నిర్వహించే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు