డిల్లీ మళ్ళీ తిరిగొస్తాడు.. “ఖైదీ 2” పై లోకేష్

డిల్లీ మళ్ళీ తిరిగొస్తాడు.. “ఖైదీ 2” పై లోకేష్

Published on Oct 25, 2024 9:00 PM IST

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ నటించిన పలు ఐకానిక్ హిట్ చిత్రాల్లో థియేటర్స్ లో అదిరే ఎక్స్ పీరియన్స్ ఇచ్చిన చిత్రం “ఖైదీ” కూడా ఒకటి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి కూడా మంచి గుర్తింపుని తీసుకొచ్చిన సినిమా కూడా ఇదే. అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన “విక్రమ్” చూసాక లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసిన యూనివర్స్ తో ఓ రేంజ్ లో మూవీ లవర్స్ ఎగ్జైట్ అయ్యిపోయారు.

అయితే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంతటికీ ఆరంభమే కార్తీ నటించిన ఖైదీ అందులో తన డిల్లీ పాత్ర. మరి విక్రమ్ తర్వాత ఖైదీ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనితో ఖైదీ 2 కోసం చాలా ఏళ్ళు నుంచి అభిమానులు ఎదురు చూస్తూ నేటితో ఖైదీ వచ్చి ఏకంగా ఆరేళ్ళు అయ్యిపోయింది. దీనితో లోకేష్ కనగరాజ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసాడు.

మొత్తం మొదలైంది ఇక్కడే.. కార్తీ గారికి నా నిర్మాత ప్రభు గారికి ఈ యూనివర్స్ మొదలు కావడానికి కారణం అయ్యినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ లాస్ట్ లో త్వరలోనే డిల్లీ మళ్ళీ తిరిగి వస్తాడు అంటూ చేసిన ట్యాగ్ హైలైట్ అయ్యింది. మరి ఈ సినిమా కోసం అయితే తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు