సమీక్ష: దిల్ రూబా – ఆకట్టుకోని లవ్ డ్రామా

Dilruba Movie Review in Telugu

విడుదల తేదీ : మార్చి 14, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : కిరణ్ అబ్బవరం, రుక్షర్ ధిల్లాన్, కాథీ డావిసన్, జాన్ విజయ్, సత్య, గెటప్ శ్రీను తదితరులు
దర్శకుడు : విశ్వ కరుణ్
నిర్మాతలు: విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి
సంగీతం : సామ్ సి ఎస్
సినిమాటోగ్రఫీ : విశ్వాస్ డానియల్
ఎడిటర్ : ప్రవీణ్ కే ఎల్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో హిట్ సినిమా “క” హీరో కిరణ్ అబ్బవరం హీరోగా రుక్షర్ ధిల్లాన్ హీరోయిన్ గా దర్శకుడు విశ్వ కరుణ్ తెరకెక్కించిన చిత్రం “దిల్ రూబా” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఇక కథలోకి వస్తే.. తన మొదటి లవ్ మేఘన – మ్యాగీ (కాథీ డావిసన్) తో బ్రేకప్ అయ్యాక సిద్ధార్థ్ రెడ్డి – సిద్దు (కిరణ్ అబ్బవరం) చాలా కుంగిపోతాడు. అలాగే తన జీవితంలో థాంక్యూ, సారి అనే రెండు పదాలు విషయంలో కూడా చాలా పర్టిక్యులర్ గా ఉంటాడు. ఇక తర్వాత ఆమె నుంచి బయటకి రావడానికి కడప నుంచి మంగుళూరు ఎంఐటి లో మెకానికల్ జాయిన్ అవుతాడు. ఇక అక్కడ పరిచయం అయ్యిన అంజలి (రుక్షర్ ధిల్లాన్) తో ప్రేమలో పడతాడు. అక్కడ నుంచి వీరి లవ్ స్టోరీ ఎలా కొనసాగింది? వీరి మధ్యలో ఎలాంటి చిక్కులు వచ్చాయి ఈ అందరిలో జోకర్(జాన్ విజయ్) ఎందుకు వచ్చాడు? చివరికి అంజలి, సిద్ధూలని కలిపేందుకు మేఘన ఏం చేస్తుంది? సిద్ధూ థాంక్యూ, సారి అనే సిద్ధాంతం ఎందుకు పెట్టుకున్నాడు అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం గత సినిమాలతో పోలిస్తే మంచి స్టైలిష్ లుక్స్ లో కనిపించాడు అని చెప్పాలి. అలాగే తనపై కొన్ని సీన్స్ లో తన నటన డీసెంట్ గా ఉంది. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ లో తన మాస్ ప్రెజెన్స్ కూడా బాగుంది. ఇక తనతో పాటుగా రుక్షర్ కెమిస్ట్రీ కూడా కొన్ని సన్నివేశాల్లో బాగుంది.

అలాగే యంగ్ నటి రుక్షర్ చిలిపి అమ్మాయిగా బానే చేసింది. ఇంకా వీరితో పాటుగా నెగిటివ్ రోల్ లో చేసిన జాన్ విజయ్ కూడా తన మార్క్ విలనిజాన్ని ప్రదర్శించారు. వీరితో పాటుగా కమెడియన్ సత్యపై కేవలం కొన్ని సీన్స్ ఓకే అనిపిస్తాయి. అలాగే సెకండాఫ్ లో కొన్ని ఒకటీ రెండు ట్విస్ట్ లు ఓకే అనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రం యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ బిగ్ స్క్రీన్ పై సినిమాకి తక్కువ అని చెప్పక తప్పదు. అసలు ఈ సినిమాలో ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు కనేపించవు. చాలా డల్ మూమెంట్స్ తో సాగే కథనం ఎక్కడా కూడా ఆడియెన్ ని ఎగ్జైట్ చేయకుండా కొనసాగుతుంది.

సినిమాలో ఏవేవో ప్రయత్నాలు కనిపిస్తాయి.. ఒక యాక్షన్ సీన్ వస్తుంది, పాటలు వస్తాయి. కానీ ఇంకా ఏదో సినిమాలో మిస్ అవుతున్న భావన ఆడియెన్ కి కలుగక మానదు. ఇలా సినిమాలో మెయిన్ సోల్ కి ఆడియెన్స్ కి పొంతన పెద్దగా కనిపించదు. చాలా సీన్స్ ఎన్నో లవ్ అండ్ బ్రేకప్ సినిమాల్లో చూసేసినవాటి లానే అవుట్ డేటెడ్ గా అనిపిస్తాయి.

హీరోకి ఒక సిద్ధాంతం పెట్టారు కానీ దానిని ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. ప్రాపర్ ఎమోషన్స్ కూడా సినిమాలో బాగా మిస్ అయ్యాయి. ఇక వీటితో పాటుగా సినిమాలో మరో హీరోయిన్ గా కనిపించిన కాథీ డావిసన్ తన రోల్ కి ఫిట్ కాలేదు. నిజానికి కిరణ్ అబ్బవరం కంటే ఆమె ఎక్కువ ఏజ్ లా కనిపిస్తుంది.

పైగా తన నటన కూడా ఎక్కడా నాచురల్ గా కనిపించదు. వినిపించే డైలాగ్ కి ఆమె పలికించే పెదాల కదలికకు అసలు పొంతనే ఉండదు. అలాగే ఈమె పాత్రపై సహా మరిన్ని అంశాల్లో సినిమాలో లాజిక్స్ కూడా పెద్దగా ఉండవు. ఇలా వీటితో దిల్ రూబా చాలా బోరింగ్ గా సాగుతుంది.

సాంకేతిక వర్గం:

సినిమాలో నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. కొన్ని అంశాల్లో ఇంకా బెటర్ గా చేయాల్సింది. మెయిన్ గా విఎఫ్ఎక్స్. టెక్నికల్ టీంలో సామ్ సి ఎస్ వర్క్ ఒకటీ రెండు పాటలు మినహా రెగ్యులర్ గా ఉంది. తన మార్క్ లో అనిపించలేదు. విశ్వాస్ డానియల్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు విశ్వ కరుణ్ విషయానికి వస్తే.. సారీ, థాంక్యూ అనే పదాలు వాటి విలువ ఎక్కడ వాడాలి అనే డీసెంట్ పాయింట్ పట్టుకున్నారు కానీ దానిని పట్టుకొని నడిపించిన విధానం మాత్రం మెప్పించాడు. ఎక్కడా కూడా సినిమాలో ఆడియెన్ ని ఎంగేజ్ చేసే రేంజ్ సీన్స్ కనిపించవు. చాలా డల్ ప్రొసీడింగ్స్ తో సాగుతుంది. ఇంకా కొంచెం ఎమోషనల్ డెప్త్ ని సినిమాలో జోడించి ఉంటే బాగుండేది ఏమో.. వీటితో అయితే తన వర్క్ ఈ చిత్రానికి పూర్తి స్థాయిలో మెప్పించాడు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “దిల్ రూబా” లో కిరణ్ అబ్బవరం డీసెంట్ గా అలరిస్తాడు. అలాగే తనతో రుక్షర్ కూడా బానే చేసింది. కానీ సినిమాలో మెయిన్ పాయింట్ కి తగ్గ కథనం మాత్రం సాగలేదు. చాలా చాలా వరకు డల్ మూమెంట్స్ తో సాగే కథనం ఆడియెన్స్ కి కనెక్ట్ కాదు. ఇంకా బెటర్ ఎమోషన్స్ ని దర్శకుడు ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. వీటితో మరీ లవ్/బ్రేకప్ సినిమాలు ఎలా ఉన్నా సరే ఇష్టపడేవారికి తప్ప మిగతా వారికి పెద్దగా కనెక్ట్ కాదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version