“రాయన్” పై స్టార్ క్రికెటర్ స్పెషల్ రివ్యూ..

“రాయన్” పై స్టార్ క్రికెటర్ స్పెషల్ రివ్యూ..

Published on Aug 27, 2024 11:53 AM IST


కోలీవుడ్ గ్లోబల్ నటుడు ధనుష్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రమే రాయన్. తాను హీరోగా దర్శకుడుగా కూడా తానే చేసిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యింది. అటు తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా డీసెంట్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లో 50వ సినిమాగా వచ్చి తన కెరీర్ మైల్ స్టోన్ సినిమాగా మంచి హిట్ అయింది. అయితే ఈ చిత్రం రీసెంట్ గానే ఓటిటిలో రిలీజ్ కి వచ్చింది.

ఇక్కడ కూడా ఈ సినిమాకి క్రేజీ రెస్పాన్స్ రాగ ఇందులో వచ్చాక మరింతమంది చూసారు. మరి ఈ సినిమాపై ఇండియా స్టార్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తన రివ్యూ అందించాడు. “ఓహ్… నాకు రాయన్ చాలా నచ్చింది. ఒక గ్రేట్ నటుడు మీలో ఉన్నాడని మాకు అందరికీ తెలుసు కానీ అంతకు మించి బ్రిలియంట్ దర్శకుడు కూడా మీలో ఉన్నాడని రాయన్ చూసాక అర్ధం అయ్యింది వెల్డన్” మీరు ఇంకా ఇలాంటి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అని దినేష్ కార్తీక్ తెలిపాడు. దీనితో రాయన్ పై ఈ స్పెషల్ రివ్యూ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు