స్టార్ హీరో ఆ డైరెక్టర్ కెరీర్ నాశనం చేశారట.

స్టార్ హీరో ఆ డైరెక్టర్ కెరీర్ నాశనం చేశారట.

Published on Jun 17, 2020 8:31 AM IST

బాలీవుడ్ఇ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య బాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. ఆయన మానసిక వేదనకు కారణమైన వారిని టార్గెట్ చేస్తూ కంగనా రనౌత్, మీరా చోప్రా, వివేక్ ఒబెరాయ్ మరియు శేఖర్ కపూర్ లాంటి వారు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. బాలీవుడ్ లో ఉన్న ఈ అణచివేత స్వభావాన్ని లేవనెత్తుతూ సల్మాన్ మరియు అతని కుటుంబం నా కెరీర్ ని నాశనం చేశారని డైరెక్టర్ అభినవ్ కశ్యప్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

2010లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన దబాంగ్‌ చిత్రానికి అభినవ్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా సల్మాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దానికి సీక్వెల్ గా 2012లో దబాంగ్ 2 రాగా ఆ ప్రాజెక్ట్ నుండి అభినవ్ కశ్యప్ ని తొలగించారు. ఆ సినిమాకు సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌, అతని కుటుంబ సభ్యులు తన కెరీర్‌ను నాశనం చేశారని అభినవ్‌ కశ్యప్‌ ఆరోపించాడు.సల్మాన్ సొదరులు అర్బాజ్, సోహైల్ ఖాన్‌ లు నన్ను బెదిరించే వారని, భయపెడుతూ మెస్సెజ్ లు పెట్టేవారని ఆయన అన్నారు. 2013లో నేను చేసిన బేషరం చిత్రాన్ని ఆపేందుకు వారు ఎంతగానో ప్రయత్నించారు..అని తీవ్ర ఆరోపణలు ఆయన చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు