డైరెక్టర్ అనీష్ లో మంచి కామెడీ ఉంది, అది ‘కృష్ణ వ్రింద విహారి’ కి ప్లస్ అయింది – హీరో నాగశౌర్య

Published on Sep 22, 2022 11:32 pm IST


యువ నటుడు నాగశౌర్య హీరోగా షిర్లే సెటియా హీరోయిన్ గా ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉష మూల్పూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మూవీ కృష్ణ వ్రింద విహారి. వెన్నెల కిషోర్, రాధిక శరత్ కుమార్, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రలు చేశారు. ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో అందరిలో సూపర్ గా అంచనాలు ఏర్పరిచిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ రేపు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది. కాగా ఈ మూవీపై తామందరికీ ఎంతో మంచి నమ్మకం ఉందని, దానికి ప్రధాన కారణం ఈ మూవీ యొక్క స్కిప్ట్ అని, అందుకే దాదాపుగా రెండున్నరేళ్లు సమయం పట్టినా మూవీని ఎంతో జాగ్రత్తగా దర్శకుడు అనీష్ తెరకెక్కించారని అన్నారు.

ఇక ఈ మూవీలోని తన క్యారెక్టర్ లో మంచి కామెడీ, ఫన్ ఉంటుందని, స్వతహాగా దర్శకుడు అనీష్ కృష్ణ కామెడీ టైమింగ్ ఎంతో బాగుంటుందని అది సినిమాకి బాగా హెల్ప్ అయిందని లేటెస్ట్ మీడియా ఇంటరాక్షన్ లో భాగంగా హీరో నాగశౌర్య అన్నారు. అలానే తన తల్లి పాత్రలో నటించిన రాధికా గారి పాత్ర సినిమాలో ఎంతో కీలకం అని, ఆవిడ ఈ రోల్ కి పక్కాగా సెట్ అయ్యారని, అటువంటి గొప్ప టాలెంట్ ఉన్న ఆమెతో వర్క్ చేయడం ఎంతో హ్యాపీ అని ఆయన అన్నారు

సంబంధిత సమాచారం :