దృశ్యం 2 పై అనీల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు!

Published on Nov 29, 2021 12:30 pm IST

విక్టరీ వెంకటేష్ హీరోగా మీనా హీరోయిన్ గా జీతూ జోసెఫ్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం దృశ్యం 2. దృశ్యం చిత్రానికి కొనసాగింపు గా తెరకెక్కిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో డైరెక్ట్ డిజిటల్ గా విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ చిత్రం పై ప్రముఖ టాలివుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు చేశారు.

చిత్రం లో అమేజింగ్ ట్విస్టు లు, టర్నింగ్ లు ఉన్నాయి అని వ్యాఖ్యానించారు. మన రాంబాబు వెంకటేష్ బ్రిలియంట్ గా , తన మైండ్ గేమ్ తో ఆకట్టుకున్నారు అని అన్నారు. దృశ్యం 2 ను మిస్ అవ్వకండి అంటూ చెప్పుకొచ్చారు. సురేష్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, రాజ్ కుమార్ థియేటర్స్ పతాకం పై డి. సురేష్ బాబు, ఆంటోనీ పెరుంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి లు సంయుక్తంగా నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :