ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హవా ఏ రేంజ్ లో నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే పుష్ప గాడి రూలుతో మొత్తం దేశం దద్దరిల్లుతుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అనేకమంది సినీ ప్రముఖులు సినిమాని అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ ని కొనియాడుతున్నారు.
ఇక లేటెస్ట్ గా అయితే కోలీవుడ్ యంగ్ అండ్ మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు సాలిడ్ రివ్యూ ఇచ్చాడు. మొట్ట మొదటగా అల్లు అర్జున్ కోసమే మాట్లాడుతూ వావ్ అల్లు అర్జున్ సార్ మీ పెర్ఫామెన్స్ అవుట్ స్టాండింగ్ నిజంగా నా హార్ట్ కి టచ్ అయ్యింది. మరో బ్లాక్ బస్టర్ కొట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఎంతో హార్డ్ వర్క్ చేసిన సుకుమార్ గారికి నా కంగ్రాట్స్ చెబుతునాన్ను మొత్తం చిత్ర యూనిట్ కి అలాగే స్పెషల్ మెన్షన్ గా రష్మికా మందన్నా పెర్ఫామెన్స్ తో బీస్ట్ లా కనిపించారు. ఫహద్ ఫాజిల్ కోసం కూడా తాను పాజిటివ్ గా చేసిన పోస్ట్ ఇపుడు ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. మరి ఆల్రెడీ బన్నీ, అట్లీ కాంబినేషన్ లో ఓ సినిమా ఉందని ఎప్పుడు నుంచో రూమర్స్ ఉన్నాయి. మరి ఈ సమయంలోనే ఆ సినిమా కూడా అనౌన్స్ చేసేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.