ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమారుడు మనోజ్ భారతీరాజా మృతిచెందారు. ఈ వార్తతో తమిళ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. దర్శకుడు భారతీరాజా కుమారుడు, నటుడు మనోజ్ భారతీరాజా(48) గుండెపోటు కారణంగా కన్నుమూశారని తమిళ మీడియా వెల్లడించింది.
మనోజ్ భారతీరాజాకు గుండెపోటు రావడంతో హుటాహుటిన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో తమిళ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మనోజ్ భారతీరాజా ‘తాజ్ మహల్’, ‘సముద్రం’, ‘కడల్ పూక్కల్’, ‘అన్నకోడి’ వంటి చిత్రాల్లో నటించారు. 2023లో ‘మార్గలి తింగళ్’ చిత్రానికి మనోజ్ భారతీరాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తన తండ్రి భారతీరాజా కూడా నటించడం విశేషం. మనోజ్ మరణ వార్తతో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.