‘డాకు మహారాజ్’ను హాలీవుడ్ మూవీతో పోల్చిన బాబీ

‘డాకు మహారాజ్’ను హాలీవుడ్ మూవీతో పోల్చిన బాబీ

Published on Dec 26, 2024 9:01 AM IST

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య పాత్ర, ఈ సినిమాలోని యాక్షన్ గురించి దర్శకుడు బాబీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.

‘డాకు మహారాజ్’ చిత్రంలో బాలయ్య పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని.. సైలెంట్‌గా ఉన్నట్లు కనిపించే బాలయ్య, పరిస్థితులను బట్టి విధ్వంసకరంగా మారుతాడని.. ఆయన చేసే యాక్షన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని.. అభిమానులు ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం ఈ సినిమాలో ఉండబోతుందని ఆయన తెలిపాడు. హాలీవుడ్‌లో ‘జాన్ విక్’ చిత్రం తరహాలో ఈ సినిమాలో బాలయ్య యాక్షన్ కనిపిస్తుందని బాబీ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు.

ఇక బాలయ్య అంటేనే మాస్ యాక్షన్ ఉంటుంది. అలాంటిది ఈ సినిమాలో ఆయన యాక్షన్ వేరే లెవెల్‌లో ఉంటుందని దర్శకుడు చెప్పడంతో ఇప్పుడు అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వారు ఆతృతగా చూస్తున్నారు. ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తుండగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు