ఇంటర్వ్యూ: డైరెక్టర్ హసిత్ గోలి – ‘స్వాగ్’లో ఫన్‌కి ఢోకా లేదు

ఇంటర్వ్యూ: డైరెక్టర్ హసిత్ గోలి – ‘స్వాగ్’లో ఫన్‌కి ఢోకా లేదు

Published on Sep 24, 2024 8:01 PM IST

కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్‌కమింగ్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘శ్వాగ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘శ్వాగ్’ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ హసిత్ గోలి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

ఇది అచ్చ తెలుగు సినిమా అని చెప్పారు.. మరి ‘శ్వాగ్’ అనే ఇంగ్లీష్ టైటిల్ పెట్టడానికి కారణం?

ఈ సినిమా నెరేషన్ విన్న వివేక్ గారు అచ్చ తెలుగు సినిమాలా ఉంది, టైటిల్ ఏమిటని అడిగారు. ‘శ్వాగ్’ అని చెప్పగానే ఆయన సర్ప్రైజ్ అయ్యారు. అలా అచ్చ తెలుగు సినిమాలా అనిపించడానికి కారణం ఉంది. ఇందులో చాలా రూటెడ్ విషయాలు ఉంటాయి. ఇందులో డిఫరెంట్ జనరేషన్స్ టచ్ చేశాం. సింగా క్యారెక్టర్ ప్రజెంట్ జనరేషన్. అలాగే 90కి సంబంధించిన క్యారెక్టర్ ఉంటుంది. దాని కంటే ముందుకు వెళితే 70కి సంబంధించిన క్యారెక్టర్ ఉంటుంది. ఇంకా ముందుకెళ్తే.. మూల పురుషుడికి సంబంధించినంత వరకు వెళ్దాం అనే ఆలోచనతో చేసిన స్క్రిప్ట్ ఇది. ఒక వంశానికి సంబంధించిన కథ ఇది. ప్రతి జనరేషన్‌లో విష్ణు గారి క్యారెక్టర్ ఉంటుంది.

ఇందులో ఎలాంటి సందేశం ఉంటుంది?

సందేశం కోసం తీసిన సినిమా కాదు ఇది. మగ-ఆడ గొడవ ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటికీ ఉంటుంది. ఎప్పటికీ ఉండేది వంశం. ఈ రెండిటిని లింక్ చేసినప్పుడు చాలా ఎక్సైటింగ్‌గా కనిపించింది. మాతృస్వామ్య వ్యవస్థ అనేది అక్కడక్కడ కనిపిస్తుంది. దాన్ని ఎక్స్‌ప్లోర్ చేయడం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సందేశం కాదు గాని.. తరతరాలుగా మగ ఆడ గొడవ అనేది ఎలా మారుతూ వచ్చింది, ఇప్పటికి దాని రిలవెన్స్ ఏంటి అనే ఆలోచనతో చేసిన కథ ఇది.

యయాతి, భవభూతి క్యారెక్టర్స్ గురించి?

యయాతి పేరు పురాణాలలో ఉన్నదే. యదు వంశానికి సంబంధించిన రాజు. ఈ సినిమాలో పేర్లని రిధమిక్‌గా పెట్టాలని అనుకున్నాం. అందుకే భవభూతి, యయాతి పేర్లని క్యారెక్టర్స్‌కి పెట్టాం. ఇందులో నాలుగు క్యారెక్టర్లకి సేమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ నాలుగు క్యారెక్టర్స్ కలిసి ఎలాంటి కథ చెప్పబోతున్నారనేది చాలా ఇంట్రెస్టింగ్.

మొత్తం నాలుగు క్యారెక్టర్స్ ఉన్నాయి కదా.. స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది?

స్క్రీన్‌ప్లే లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ కథ రాస్తున్నప్పుడే అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని అనుకున్నాం. స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఆడియన్స్‌కి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. విష్ణు నుంచి కోరుకునే ఫన్ ఉంటుంది. ఆ ఫన్ కూడా కథలో చాలా ఆర్గానిక్‌గా కుదిరింది. ఇందులో ఫన్, కథకి ఢోకా ఉండదు. ఇంటర్వెల్ బ్లాకు ఆశ్చర్యపోయేలా ఉంటుంది.

రీతూ వర్మ క్యారెక్టర్ గురించి?

రీతు గారికి స్ట్రాంగ్ లేడీ స్క్రీన్ పర్సోననా ఉంది. వింధ్యామర వంశాని రాణిగా కనిపిస్తారు. ఈ క్యారెక్టర్‌ని ఆమె చేస్తేనే పర్ఫెక్ట్ అనుకున్నాం. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.

శ్రీ విష్ణు గారు గెటప్స్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?

శ్రీ విష్ణు గారికే కాదు.. మా టీమ్ అందరికీ ఇలాంటి గెటప్స్‌తో ఉన్న కథ చేయడం కొత్త. అందరం ఒక ఛాలెంజ్‌లా తీసుకుని సినిమా చేశాం. శ్రీ విష్ణు గారు చాలా ఎనర్జిటిక్‌గా పెర్ఫార్మ్ చేశారు. విష్ణు గారు కాకుండా ఆయన చేసిన క్యారెక్టర్స్ కనిపించాయి. కథని ముందుకు తీసుకెళ్లడానికే ఎఫర్ట్ పెట్టారు. భవభూతి క్యారెక్టర్ నాకు చాలా సర్ప్రైజ్ చేసింది. యయాతి క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అవుతుంది.

మీరాజాస్మిన్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇది. ఈ కథ ఆవిడకి చాలా నచ్చింది. తెలుగులో ఇలాంటి సినిమా వస్తుందని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదని చెప్పారు.

వివేక్ సాగర్ మ్యూజిక్ గురించి?

‘రాజరాజ చోర’కి కలిసి పని చేశాం. బ్యాక్‌గ్రౌండ్ స్కోరు వివేక్ సాగర్ బిగ్గెస్ట్ స్ట్రెంత్. అది ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆడియన్స్‌ని కట్టిపడేస్తుంది.

ఈ సినిమాకి పార్టీ 2 ఉంటుందా?

కొనసాగింపు ఉండే అవకాశం ఉన్న కథ ఇది. ఇది వంశానికి సంబంధించిన కథ. ఆ క్యారెక్టర్స్‌లో ఎవరి కథ అయినా రాసుకోవచ్చు. అయితే ఈ సినిమా వరకు మాత్రం ఈ కథ పూర్తవుతుంది.

నెక్స్ట్ ఎలాంటి కథ చేస్తున్నారు?

నెక్స్ట్ కథపై ఐడియాస్ ఉన్నాయి కానీ.. వాటిని ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఫాంటసీ నాకు చాలా ఇష్టమైన జోనర్. ఆ జోనర్‌లో సినిమా చేయాలని ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు