కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ చివరి చిత్రం విక్రమ్. ఈ చిత్రం తెలుగు లో కూడా రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన అనిరుద్ రవి చందర్ కి అమాంతం క్రేజ్ పెరిగింది. తెలుగు లో సినిమా ఏదైనా అనిరుద్ రవి చందర్ ను తీసుకుంటే బాగుండేది అనేది ఫ్యాన్స్ ఒపీనియన్. అయితే అనిరుద్ రవి చందర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లియో ఒకటి.
ఈ చిత్రం నుండి సంజయ్ దత్ పాత్రకి సంబందించిన వీడియో ను మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది. అనిరుద్ రవి చందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ లో ఉంది ఈ వీడియో లో. అయితే ఈ వీడియో పై టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ కామెంట్స్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే, నా దృష్టిలో నిస్సందేహంగా అనిరుద్ రవి చందర్ కంట్రీ లో నంబర్ వన్ అంటూ చెప్పుకొచ్చారు.
హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అయితే డైరెక్టర్ హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ఇండస్ట్రీ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం లో శ్రీ లీల లేడీ లీడ్ లో నటిస్తుంది.
When it comes to background score
i think @anirudhofficial is undoubtedly number one in the country ???????????????? https://t.co/8WH4y6OSc7— Harish Shankar .S (@harish2you) August 1, 2023


