మ్యాచో హీరో గోపీచంద్ నటించిన 25వ సినిమా పంతం తో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు చక్రవర్తి. అయితే గత ఏడాది విడుదలైన ఈ చిత్రం చక్రి కి బ్రేక్ ఇవ్వలేదు. దాంతో తన తదుపరి చిత్రాన్ని స్టార్ హీరోతో చేసే అవకాశం రాబట్టులేకపోయాడు ఈ రైటర్ కమ్ డైరెక్టర్.
ఇక ప్రస్తుతం ఆయన వెంకటేష్ , నాగ చైతన్య ల మల్టీ స్టారర్ వెంకీమామకి కో రైటర్ గా పనిచేస్తున్నాడు. ఇక ఇదిలావుంటే తన రెండవ చిత్రాన్ని మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడట చక్రి. ఈ సినిమాకి ఓ యంగ్ హీరో తన డేట్స్ ఇచ్చాడట. మరి ఆ హీరో ఎవరనేది మరి కొద్దీ రోజుల్లో క్లారిటీ రానుంది. త్వరలోనే ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు వెలుబడనున్నాయి.