ఆచార్య: బీస్ట్ మోడ్ లో ఉన్న హీరో చాలా హనేస్ట్ గా ఉంటాడు – కొరటాల శివ

ఆచార్య: బీస్ట్ మోడ్ లో ఉన్న హీరో చాలా హనేస్ట్ గా ఉంటాడు – కొరటాల శివ

Published on Apr 27, 2022 8:35 PM IST

 

మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్లుగా కమర్షియల్ కథ ఇది. సెట్ ఇన్ ఆ కంప్లీట్ న్యూ బ్యాక్ డ్రాప్. ఇది ప్రయోగాత్మకంగా తీసిన చిత్రం కాదు. అన్ని రకాల ప్రేక్షకులను, అభిమానులను అలరించే విధంగా మూవీ ఉంటుంది. ఒక హీరో విలన్ తో ధర్మ గురించి పోరాడే విధంగా ఉంటుంది. ధర్మం అవసరం అని అండర్ లైన్ చేసే కథ ఇది. హీరో ను కొత్తగా చూపించే ప్రయత్నం చేసే విధం గా చూపించడం జరిగింది.

ఇందులో రెండు ప్రధాన పాత్రలు. ఒకరు సౌమ్యుడు, సిద్ధ చాలా ఇంట్రెస్టింగ్ పాత్ర. ఆచార్య చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా టఫ్ అని తెలిసీ కూడా చరణ్ కోసం చాలా వెయిట్ చేశాం. సిద్ధాంతాలు, పోరాటాల నుండి తీయలేదు, వాళ్ళ పాత్ర, వాళ్ళ ఆశయాలు గురించి తీయడం జరిగింది.

ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు. ఎంగేజింగ్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సినిమా. బీస్ట్ మోడ్ లో ఉన్న హీరో చాలా హనేస్ట్ గా ఉంటాడు.

 

కమర్షియల్ గా కాకుండా, సందేశం ఏమైనా ఉంటుందా?

ఇద్దరూ కమర్షియల్ స్టార్స్, చాలా స్ట్రాంగ్ ఎక్స్ ప్రెషన్స్ వస్తూనే ఉంటాయి. ఇది కమర్షియల్ సినిమా.

 

ఇద్దరికీ చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది, ఎలా మేనేజ్ చేశారు?

ఎవరి పాత్రకి తగ్గట్లు వాళ్లకు ఉంటుంది. ఇద్దరు కలిసి ఉన్న సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి.

యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఫిల్మ్ ఇది. అందరికీ నచ్చాలి. ప్లానింగ్ లేకుండా, ప్రాపర్ పోస్ట్ ప్రొడక్షన్ లేకుండా చేయడం కొంచెం ఇబ్బంది అయింది.

సినిమా చాలా ఎమోషనల్, మాసి బ్యాక్ డ్రాప్, అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అయితే చిరు పక్కన, చరణ్ ను బ్యాలన్స్ చేయగలనా అనిపించింది. కాకపోతే ఇద్దరు చాలా ఈజ్ గా మూవ్ అయ్యారు. చాలామంది వచ్చి చూశారు షూటింగ్ టైమ్ లో.

 

సంగీతం విషయం లో మణిశర్మ ను తీసుకోవడం పై అభిప్రాయం?

ఇందులో ఏది పడితే అది చేయలేం. ఇందులో మణిశర్మ చేసిన విధానం అద్బుతం.

రామ్ చరణ్ ఎంట్రీ నుండి ఇంకా చాలా బాగుంటుంది. ఆచార్య మొదటి నుండి టైటిల్ ను అదే అనుకున్నాను. కేజీఎఫ్ స్క్రిప్ట్ లో ఉండటం వలన పాన్ ఇండియా గా వచ్చింది.

ఈ చిత్రం కోసం నిర్మాతలు చాలా కష్టపడ్డారు. ప్రొడక్షన్ కి చాలా కేర్ తీసుకున్నారు. టెంపుల్ బ్యాక్ గ్రౌండ్, రీసెర్చ్ చాలా చేశారు.

 

ఆచార్య కు బీజం ఎక్కడ పడింది?

ఎప్పటినుండో ఒక ఐడియా ఉంది. ఒక టెంపుల్ టౌన్ లో ఒక నక్సలైట్ వచ్చి సెటిల్ అయితే ఎలా ఉంటుంది. అలా వచ్చింది కాన్సెప్ట్.

ఈ సినిమా కి చాలా టెన్షన్ ఉంది, ప్రతి చిత్రానికి టెన్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికీ కథ నచ్చేలా సినిమా ఉంటుంది.

మెసేజ్ ఇవ్వాలని ఆలోచించను. ఒక డిఫెరెంట్ వరల్డ్ లో డిఫెరెంట్ పాత్రను, స్ట్రాంగ్ పాత్రను ఇవ్వాలని తీస్తున్నా. భరత్ అనే నేను లో ప్రామిస్ చేస్తే దాన్ని నిలబెట్టుకోవాలి అనేది సినిమా. స్ట్రాంగ్ ఎక్స్ ప్రెషన్.

శ్రీ మంతుడు లాంటి చిత్రం లో మొత్తం కుటుంబం కోసం కాకుండా, ఊరు కోసం చేయడం అనేది నాకు హీరోయిజం కనిపించింది. కొందరు పాత్రలను దృష్టి లో పెట్టుకొని తీసా అది. స్ట్రాంగ్ ఎక్స్ ప్రెషన్ అది.

స్వామి వివేకానంద మీద గాంధీ లాంటి సినిమా తీయాలని ఉంది. అందుకు అనుభవం రావాలి. మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అతను. ఇండియా మొత్తాన్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్ అతను. భారీ రేంజ్ లో తీయాలి తీస్తే.

నా దగ్గర నా టీమ్ నాలుగేళ్లు స్ట్రక్ అయి పోయి ఉన్నారు. వాళ్ళు దర్శకులు అయితే చూడాలని ఉంది. వాళ్ళ సినిమాలు చూడలనీ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు