టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన క్రిష్ మరియు ఆయన సతీమణి రమ్య విడాకులకు అప్లై చేసినట్టు తెలుస్తోంది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. 2016 ఆగష్టులో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
ఆ తరవాత క్రిష్ టాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమల్లో వరుస సినిమాలతో పూర్తిగా బిజీ అయిపోయారు. రమ్య కూడా హైదరాబాద్లోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఇలా రెండు భిన్నమైన వృత్తుల్లో ఉన్న వీరిద్దరి మధ్య ఆ వృత్తుల కారణంగానే విభేదాలు తలెత్తడంతో విడిపోవడం మంచిదని ఇద్దరూ నిర్ణయించుకున్నట్టు సమాచారం.