చరణ్ తో సినిమాపై కృష్ణవంశీ ఈసారి ఇంట్రెస్టింగ్ క్లారిటీ

చరణ్ తో సినిమాపై కృష్ణవంశీ ఈసారి ఇంట్రెస్టింగ్ క్లారిటీ

Published on Jul 27, 2024 7:04 AM IST

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పలు భారీ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ఆల్రెడీ పాన్ ఇండియా దర్శకుడు శంకర్ తో “గేమ్ ఛేంజర్” అనే భారీ సినిమా చేస్తుండగా ఈ సినిమా తర్వాత క్రేజీ ప్రాజెక్టులు మరిన్ని చేయనున్నాడు. అయితే ఈ సినిమాల సంగతి పక్కన పెడితే మన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ చరణ్ తో సినిమా పై ఇంట్రెస్టింగ్ క్లారిటీ ఇచ్చారు.

కొన్ని రోజులు కితమే తను చరణ్ కోసం సూపర్ స్క్రిప్ట్ రెడి చేసాను ఎప్పుడు ఒకే అంటే అప్పుడు సిద్ధం అని తెలిపారు. కానీ లేటెస్ట్ గా మరో క్లారిటీ అందించారు. నేను సిద్ధమే కానీ ఇప్పుడు చరణ్ చాలా బిజీగా ఉన్నాడు. మన మెగా లాగ ఈ బిజీ తన లైఫ్ లో కొనసాగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. దీనితో తను సిద్ధంగానే ఉన్నాను కానీ చరణ్ బిజీ లైఫ్ అలానే కొనసాగాలని కోరుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చారు. దీనితో వీరి కాంబినేషన్ లో సినిమా ప్రస్తుతానికి ప్రశ్నార్ధకమే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు