రజినీతో సినిమాపై సాలిడ్ కామెంట్స్ చేసిన లోకేష్ కనగ్ రాజ్.!

Published on Aug 12, 2022 6:06 pm IST

కోలీవుడ్ సినిమా దగ్గర ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయినటువంటి దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది లేటెస్ట్ భారీ హిట్ సినిమా “విక్రమ్” దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ అనే చెప్పాలి. దీనితో సెన్సేషన్ గా మారిన లోకేష్ కనగ్ రాజ్ నుంచి కొన్ని కాంబోస్ కోసం ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఆ కాంబోస్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు.

మరి లేటెస్ట్ గా అయితే రజినీతో సినిమా విషయంలో తాను చేసిన కొన్ని సాలిడ్ కామెంట్స్ వైరల్ గా మారాయి. రజినీతో సినిమా చేయడం మామూలు విషయం కాదని ఆయన మార్కెట్, స్టార్డం ని మ్యాచ్ చేస్తూ చేయడం చాలా కష్టం నేను ఆయనతో వర్క్ చేయాలని ఎప్పుడు నుంచో చాలా ఆసక్తిగా చూస్తున్నానని, ఆల్రెడీ ఒక ఐడియా ఉందని నా కోరిక ఎప్పటికైనా నెరవేరుతుందని అనుకుంటున్నానని తెలిపాడు. దీనితో ఇప్పుడు ఈ కామెంట్స్ మంచి వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :