“@లవ్” ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి – డైరెక్టర్ నాగ్ అశ్విన్

“@లవ్” ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి – డైరెక్టర్ నాగ్ అశ్విన్

Published on Aug 12, 2022 10:25 AM IST

ఓ విభిన్నమైన కథ, కథనాలతో సహజత్వానికి దగ్గరగా రాబోతున్న సరికొత్త చిత్రం @లవ్. రామరాజు, సోనాక్షి వర్మ, అభి, ప్రీతి సింగ్, శ్రీకృష్ణ మరియు డాక్టర్ మారుతి సకారం తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగో ను టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేశారు. గిరిజన నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమ కథతో రాబోతున్న ఈ సినిమా, ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని, అందులో భాగంగానే, నేడు తాను ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నానని నాగ్ అశ్విన్ చెప్పారు.

వాస్తవానికి చాలా దగ్గరగా ఉండే ఈ కథ, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు. TMS బ్యానర్ లో ప్రీతమ్ ఆర్ట్స్ అండ్ SN క్రియేషన్స్ కలయికతో మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు శ్రీనారాయణ నిర్మాతలుగా రూపొందించిన ఈ చిత్రంలో అందరూ నూతన నటీనటులు నటించారు. శ్రీనారాయణ దర్శకత్వంలో, మనసుకు హత్తుకునే ఎమోషన్స్ తో పాటు ఆడజాతికి సంబంధించిన ఓ గొప్ప సందేశం కూడా అంతర్లీనంగా ఉంటుందట. ఈ సినిమా మొత్తం ఆటవిక నేపథ్యంలో సాగడం విశేషం.

రామరాజు, సోనాక్షి వర్మ, అభి, ప్రీతి సింగ్, శ్రీకృష్ణ, డా. మారుతీ సాకారామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు మహేందర్ సింగ్, శైలజ తాటిచర్ల, శ్రీనారాయణ, రచన, దర్శకత్వం శ్రీనారాయణ, మ్యూజిక్ సన్నీ మానిక్, రామ్ చరణ్, ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్, కెమెరామెన్ మహేందర్, సౌండ్ డిజైన్ యతీరాజ్, పీఆర్ఓ శ్రీధర్ లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు