కాజల్ పనితనం చూసిన ఆశ్చర్యపోయిన డైరెక్టర్

Published on Apr 15, 2021 8:37 pm IST

కాజల్ అగర్వాల్ స్టార్ హీరోల సినిమాలో కథానాయికగా నటిస్తూనే సోలో హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేసిన తమిళ చిత్రం ‘గోష్టి’ షూటింగ్ ముగించుకుంది. జనవరిలో మొదలైన ఈ సినిమా చాలా వేగంగా చిత్రీకరణ జరుపుకుంది. కాజల్ ఇదివరకు చేసిన సినిమాలన్నీ కమర్షియల్ సినిమాలే కాగా ఇది మాత్రం పాలిటికల్ హర్రర్ మూవీ. సమకాలీన రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని వాటికి ఫన్, హర్రర్ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించారట. నిన్ననే సినిమా ఫస్ట్ లుక్ కూడ వదిలారు.

అందులో కాజల్ జయలలిత తరహా వేషధారణలో కనబడగా ఇంకొందరు శశికళ, అమిత్ షా, ఇంకొందరు ప్రముఖ రాజకీయవేత్తల ఆహార్యంలో ఉన్నారు. పైగా సినిమాకు పాలిటిక్స్, హర్రర్ రెండూ వినబడేలా ‘గోష్ఠి’ అనే పేరును పెట్టారు. ఈ చిత్ర దర్శకుడు ఎస్.కళ్యాణ్ మాట్లాడుతూ ‘కథ వినగానే కాజల్ ఓకే చెప్పేశారు. జనవరిలో మొదలుపెట్టి చాలా త్వరగా ముగించేశాం. ముఖ్యంగా కాజల్ మేడమ్ గురించి చెప్పాలి. మొదటిరోజు ఏ ఎనర్జీతో అయితే సినిమా మొదలుపెట్టామో షూటింగ్ లాస్ట్ డే వరకు అదే ఎనర్జీతో పనిచేశారు ఆమె’ అంటూ కాజల్ పనితనాన్ని కొనియాడారు. ఈ చిత్రాన్ని మే ఆఖరు లేదా జూన్ మొదటి వారంలో రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :