తారక్ కు ప్రశాంత్ నీల్ రిక్వెస్ట్.?

Published on Aug 15, 2020 3:00 am IST


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి తో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ మల్టీ స్టారర్ పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు. దీని తర్వాత కూడా తారక్ లైన్ లో మరో రెండు భారీ చిత్రాలు లైన్ లో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తెరకెక్కించనున్న పవర్ ఫుల్ ప్రాజెక్ట్ కూడా ఒకటి.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం ప్రతీరోజు ఏదోక బజ్ వినిపిస్తూనే ఉంది. అలా ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా మరో బజ్ వినిపిస్తుంది. ఇటీవలే స్క్రిప్ట్ వర్క్ కోసం ఈ ఇద్దరూ మాట్లాడుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ తారక్ ను ఒక రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ చిత్రానికి దాదాపు సంవత్సరంన్నర కాలం డేట్స్ తారక్ ఇవ్వనుండగా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటుగా హిందీలో కూడా ఏక కాలంలో షూటింగ్ చెయ్యాలని కోరారట. డబ్బింగ్ చేసే కన్నా ఇలా చేస్తే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని ఈ విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ భారీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More