విలక్షణ నటుడు ఎస్.జే. సూర్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన నటనతో ఆకట్టుకోవడం మాత్రమే కాదు. దర్శకుడుగా కూడా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న వ్యక్తి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన ఖుషీ చిత్రానికి దర్శకుడు ఇతనే. ఇప్పుడు నటుడుగా చాలా బిజీగా మారిపోయాడు ఎస్.జే. సూర్య. హీరో నాని లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం చిత్రంలో విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఆగస్టు 29 న థియేట్రికల్ రిలీజ్ కి రెడీ అయిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ చాలా గ్రాండ్ గా జరిగింది.
ఈ వేడుకలో హను మాన్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ హాజరు కాగా, పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. “చిన్నప్పుడు ఖుషీ చిత్రాన్ని చూసి ఇంటికొచ్చా, ఇంటికొచ్చే టైమ్ కి మా ఇంటి దగ్గర అంతా పోలీసులతో హడావిడిగా ఉంది. ఏమైంది అని టెన్షన్ పడి చూస్తే, మా ఇంట్లో వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. నేను తప్పిపోయానేమో అనుకొని. సినిమా థియేటర్ కి వెళ్లా మార్నింగ్. కంటిన్యూస్ గా చూస్తూనే ఉన్నా అన్నమాట.ఇంటికి రాలేదు ఆరోజు. సెకండ్ షో ఐపోయాక ఇంటికొచ్చాను. తప్పిపోయానేమో అనుకున్నారు. మిమ్మల్ని చూడగానే ఆ ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది” అని ఎస్. జే. సూర్య గురించి ప్రస్తావిస్తూ తెలిపారు.